Home ఆదిలాబాద్ ఫలించనున్న పంచతంత్రం

ఫలించనున్న పంచతంత్రం

కుదిరిన ‘మహా’ ఒప్పందం
కలిసి నడుద్దామన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం
ఈ ఒప్పందంతో జిల్లాకు భారీ లాభం
అదనంగా ౩ లక్షల ఎకరాలకు సాగునీటికి అవకాశం
ఐదు బ్యారేజీలతో జిల్లా సశ్యశ్యామలం అన్నదాతల్లో హర్షం

godavariఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి/మంచిర్యాల ప్రతినిధి: నాలుగు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. నింగి నుండి గంగను భువికి దించిన భగీరథ ప్రయత్నం వలే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహారాష్ట్రతో నడిపిన దౌత్యం ఫలించింది. ఫలితంగా తెలంగాణ ఆవిర్భావ అనంతరం తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య మూడవ వారి ప్రయేయం లేకుండా చారిత్రక ఒప్పందం కుదిరింది. ఐదు ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు ఒకే అనడంతో ఇక జిల్లాకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రతియేటా బోరున కురుస్తున్న వర్షపునీటిని ఒడిసి పట్టుకునే సౌకర్యాలు లేక జిల్లా కరువు పరిస్థితులకు గుర వుతూనే ఉంది. వర్షపునీటిని నిల్వ చేసుకునే విధానం సక్రమంగా లేకపోవడం జిల్లాకు శాపమవుతోంది. వేలాది టిఎంసిల వర్షపునీరు వరదరూపంలో గోదా వరి నీరు సముద్రం పాలవుతోంది. గత కొన్నేళ్ల నుంచి ఈ వ్యవహారం సాగు తూనే ఉన్నప్పటికీ పాలకులు మాత్రం ఈ వైపు దృష్టి సారించడంలో విఫల మవుతూ వస్తున్నారు. ఎట్టకేలకే టిఆర్‌ఎస్ ప్రభుత్వం గోదావరి జలాల సద్విని యోగంపై సీరియస్‌గా దృష్టి సారించి ఆ జలాలన్నింటినీ ఒడిసి పట్టుకునే దిశగా ప్రణాళికలను చేపట్టింది. ఇందులో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదా వరి జలాల వినియోగం విషయంపై కొనసాగుతున్న వివాదాలను పరిష్కరిం చుకోవాలని తలపెట్టింది.
జిల్లా సస్యశ్యామలం
ఆదిలాబాద్ జిల్లా రెండు పవిత్ర నదుల మధ్యలో ఉంది. ఉత్తరాన పెన్‌గంగా, దక్షిణాన గోదావరి ఉన్నాయి. వీటి ఉపనదులైన స్వర్ణ, సుద్దవాగు, ఖడెం, గొల్ల వాగు, వట్టివాగు, పెద్ద వాగు, రాళ్లవాగులతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వార్ధా, ప్రాణహిత నదులు జిల్లా సరిహద్దునుండి ప్రవహిస్తున్నాయి. ఈ నదీ జలాలు అందుబాటులో ఉన్నప్పటికి నీటిని ఆపే ఆనకట్టలు లేకపోవడంతో ఉన్న నాడు ఉగాది, లేదంటే శివరాత్రి అన్న చందాన వర్షంకాలంలో వరదలు, డిసెం బర్ రాగానే అనావృష్టితో అన్నదాతలు విలవిలలాడుతు వచ్చారు. ఈ నదీ జలా లను ఒడిసి పట్టుకుని పంట పొలాలకు మళ్లించాలనే ఆలోచన గడిచిన నాలుగు దశాబ్దాల నుండి చర్చల దశలోనే మూడడుగులు ముందుకేస్తే ఆరడుగులు వెనక్కి అన్న చందాన కొనసాగుతూ వచ్చింది.
చారిత్రాత్మక ఒప్పందంతో జిల్లాకెంతో మేలు
సోమవారం తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కెసిఆర్, ఫడ్నవిస్‌ల బృం దాల చర్యలు సఫలం కావడం ఐదు బ్యారేజీలకు ఒప్పందాలు కుదరడంతో జిల్లా కెంతో మేలు చేకూరనుంది. ఈ ఐదింటికి ఐదు జిల్లాలకు చుట్టూ ఉండడంతో ప్రతి ఒక్కటి జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రాణహిత నది పై కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీతో మొదట 56వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉండగా రీ డిజైన్ వల్ల ఎత్తిపోతల విధానంలో 1 లక్ష 56వేల ఎకరాలకు సాగునీరందించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. రూ. 4,231 కోట్ల అంచ నాతో 160 టియంసిల నీటి సామర్థంతో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు లక్షంతో నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు అధికార యంత్రా ంగం చెబుతోంది. తుమ్మిడిహెట్టి వద్ద మొదట 152 మీటర్ల ఎత్తులో ఆనకట్ట నిర్మించేందుకు సర్కారు అనుకున్నప్పటికి తాజాగా ఒప్పందంలో ఈ ఎత్తును 148కి తగ్గించారు. దీని దిగువనే కాలేశ్వ రంలో మేడిగడ్డ, సుందిళ్ళ వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీలతో కరీంనగర్ తదితర జిల్లాలతోపాటు జిల్లాకు సాగునీరందనుంది. ఇక 1975 నుండి ఇరు ప్రాంతాల ప్రజలు ఆకాంక్షిస్తున్న పెన్‌గంగ ప్రాజె క్టు (కొరాఠా చెనాఖా ) ఎట్టకేలకు సాకారం అయ్యే దశకు చేరుకుంది. రూ. 386 కోట్ల అంచనాతో 1.50 టియంసిల నీటి సామర్థంతో దాదాపు 20 వేల సాగు విస్తీర్ణం అంచనాతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో దాదాపు 14 వేల ఎకరాలకు ఆదిలాబాద్ జిల్లాలోనే సాగునీరు అందనుంది. ఇక మహారాష్ట్రలో ఆ రాష్ట్రం నిర్మించ తలపెట్టిన పింప రాడ్ బ్యారేజీతో ఈ జిల్లాలో 5వేల ఎకరాల వరకుసాగు నీరు అంద నుంది. ఇదే నదిపై రాజంపేట వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీతో మహారాష్ట్రలో 2.500, ఆదిలాబాద్ జిల్లాలో 2.500 ఎకరాలకు సాగు నీరు అందనుంది. మొత్తానికి ఈ 5 బ్యారేజీలతో జిల్లా సస్యశ్యామలం కానుంది. మహారాష్ట్ర సర్కారుతో కుదిరిన ఒప్పందం ఎస్‌ఆర్‌ఎస్‌పి ఆటంకాలను సైతం తొలగించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ సిఎం కెసిఆర్ మహారాష్ట్ర సర్కారుతో కుదుర్చుకున్న చారిత్రత్మాక ఒప్పందం జిల్లా సాగునీటి రంగానికి ఓ వరంగా మారబోతుండడమే గాకుండా ఇక్కడి దాదాపు 3లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందే అవకాశాలు ఏర్పడనున్నా యంటున్నారు..
ఒప్పందంతో సంబురాల్లో జిల్లా నాయకులు, కార్యకర్తలు
మహారాష్ట్రతో సుదీర్ఘ కాలంగా వివాదాలతో నలుగుతున్న ఐదు బ్యారేజీలకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదరడంతో జిల్లాలోని టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, మిఠాయిలు పంచుకున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, నల్లాల ఓదెలు, దుర్గం చిన్నయ్య, కోవ లక్ష్మి, రాథోడ్ బాపురావ్, విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి ల ఆధ్వర్యంలో మహారాష్ట్రకు ఒప్పందం కోసం వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు జిల్లా మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నాయకులను కార్యకర్తలను, రైతులను రాష్ట్ర రాజధానికి తరలించారు.