Home కరీంనగర్ బస్ ఢీకొని ఇద్దరు విద్యార్థులకు గాయాలు

బస్ ఢీకొని ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Bus-Accident

కరీంనగర్ ః మెదక్ జిల్లా సిద్దిపేట డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్‌టిసి బస్సు నెంబర్ టిఎస్ 15 జడ్ 0115 శనివారం ఉదయం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల బస్టాండ్‌లో రివర్స్ తీసుకునే సమయంలో ఇద్దరు విద్యార్థులను ఢీకొనగా వారికి గాయాలయ్యాయి. గాయాల పాలైన విద్యార్థులను ప్రాంతీయ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. అయితే విద్యార్థులు సిరిసిల్ల- కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బస్సులను అజాగ్రత్తగా నడిపే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని, గాయాల పాలైన విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థుల రాస్తారోకో వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యం పాలయ్యారు. పోలీసుల జోక్యంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. బస్సు డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు దర్యాప్తు సాగుతోంది.