Home తాజా వార్తలు ఎన్ఐటి సమ్మర్ క్యాంప్‌కు ఎంపికైన ఇద్దరు విద్యార్థినీలు

ఎన్ఐటి సమ్మర్ క్యాంప్‌కు ఎంపికైన ఇద్దరు విద్యార్థినీలు

Students

నాగర్‌కర్నూల్ ః వరంగల్ జిల్లా కేంద్రంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి)లో బుధవారం ప్రారంభమైన సైన్స్ ప్రదర్శనల పై నిర్వహిస్తున్న వేసవి శిబిరం నాగర్‌కర్నూల్ జిల్లా నుండి ఇద్దరు విద్యార్థినీలు ఎంపికయ్యారు. జడ్‌పిహెచ్‌ఎస్ తూడుకుర్తి హైమావతి 10 వ తరగతి విద్యార్థిని జడ్‌పిహెచ్ ఎస్ బాలికల అచ్చంపేట 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్షిత ఇద్దరు విద్యార్థినిలు ఈ శిబిరంలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఇస్రోలో పాల్గొనేందుకు గతంలో అంతర్జాలం ద్వారా దరఖాస్తులు చేసుకున్న విద్యార్థినీలు జిల్లాకు ఇద్దరు చొప్పున జాతీయ విద్యా శిక్షణ మండలి అధికారుల ఎంపిక చేశారు. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లా నుండి ఇద్దరు విద్యార్థినీలు ఎంపిక కాగా ఎన్‌ఐటిలో పాల్గొనేందుకు వరంగల్ బుధవారం వెళ్ళారు.

జాతీయ మానవ వనరుల మంత్రిత్వశాఖ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియన్ సౌజన్యంతో నీట్‌లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ శిక్షణ శిబిరంలో విదార్థులకు శాస్త్ర సాంకేతిక పరిశోధనా రంగం పై ఆసక్తి కలిగించడం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు యందు దాగిన సృజనాత్మకతను వెలికితీయడం వినూత్న సైన్స్ పరికరాల తయారిలో కార్యక్రమాల్లో విద్యార్థులు నెల రోజుల పాటు పాల్గొననున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా నుండి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాటజీ ఎంపికైన విద్యార్థినులను జిల్లా విద్యాశాఖ అధికారి యం గోవిందరాజులు జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి విద్యార్థునులను జిల్లా విద్యాశాఖ అధికారి యం గోవిందరాజులు జిల్లా సైన్స్ అధికారి కృష్ణారె౭డ్డి విద్యార్థినులను అభినందుస్తూ నీట్‌లో పాల్గొనే విద్యార్థులు నాగర్‌కర్నూల్ జిల్లాను జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని విఙ్ఞానంతో పాటు వినోదాన్ని అందించే కార్యక్రమంలో పాల్గొనడం విద్యార్థినీలకు మంచి అవకాశమని శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థినీలు రాణించాలని డిఇఓ గోవిందరాజులు అభిలాశించారు.

Two students selected for the NIT Summer Camp