Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చిన్నారికి ఒకేసారి రెండు శస్త్రచికిత్సలు

Apollo

హైదరాబాద్ : అపోలో హాస్పిటల్స్ ఐదేళ్ల బాలికకు కాలేయ మార్పి డి, ఓపెన్ హార్ట్ సర్జరీని కొద్ది గంటల తేడాతో నిర్వహించి వైద్య చరిత్ర లో సృష్టించడం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వైద్య నిపుణులు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. తీవ్రదశకు చేరుకున్న లివర్ సిరోసిస్, పుట్టుకతో గుండెలో లోపాలు, పెరుగుదలలో లోపం, రికెట్స్‌తో సహా పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్న బాలికకు ఈ చికిత్సలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఐదేళ్ల పార్వతి రోహ్రా అరుదైన అలగిల్లే సిండ్రోం అనే జన్యుసంబంధిత వ్యాదితో బాధపడుతోంది. ప్రతి లక్షమందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధిఅరుదైనది.

Comments

comments