Home తాజా వార్తలు ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు

ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు

Police-Suspend

సూర్యాపేట: జిల్లా మద్దిరాల మండలం పోలుమల్లలో ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలుమల్లు ప్రాథమిక పాఠశాలలో సోమవారం డిఇఒ వెంకటనర్సమ్మ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో  పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు వంతుల వారీగా విధులకు హాజరవుతున్నట్లు తేలింది. దాంతో డిఇఒ ఆ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ… విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి చర్యలకైనా వెనుకాడబొమని తెలిపారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాల్సిందేనన్నారు.