Home తాజా వార్తలు జైట్లీ బడ్జెట్‌పై తెలుగు ప్రజల అసహనం

జైట్లీ బడ్జెట్‌పై తెలుగు ప్రజల అసహనం

jaitly
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో  ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఎపి ప్రజలు గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించక పోవడం గమనార్హం. దీంతో టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ కేటాయిస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ఏమైందని నాయకులు ప్రశ్నించారు. ఇదిలాఉండగా బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల పేర్లు వినిపించకపోవడంపై తెలుగు ప్రజలు సామాజిక మాధ్యమాల్లో కేంద్రంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే విషయంలో తెలుగు రాష్ట్రాల పేర్లు ప్రస్తావించని జైట్లీ… బెంగళూరు మెట్రోకు మాత్రం 17వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు 17వేల కోట్లు కేటాయించడం గమనార్హం. కాగా, తెలంగాణ గిరిజన యూనివర్సిటీకి రూ. 10 కోట్లు, హైదరాబాద్ ఐఐటికి రూ. 75 కోట్లు, ఎపి ఐఐటికి రూ. 50కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు.