Home తాజా వార్తలు ఎన్‌కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు హతం

Encounter

 

జమ్మూకశ్మీర్‌: బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. సోమవారం చారీ షరీఫ్‌‌లోని జిన్‌పాంచల్ వద్ద ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. చారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. సైనికులపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇదే ప్రాంతంలో నక్కిన మరో తీవ్రవాదిని పట్టుకునేందుకు సైనికులు రహదారులన్నీ దిగ్బంధించి గాలింపు చర్యలు చేపట్టారు.53 రాష్ట్రీయ రైఫిల్స్, బుద్గాం పోలీస్, సిఆర్‌పిఎఫ్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

 

Two Terrorists Dead in Encounter at Budgam