Home Default ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు హతం

ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు హతం

Encounter

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో అనంత్ నాగ్ జిల్లాలో బుధవారం ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి చొరబాటు యత్నానికి ప్రయత్నించడంతో భద్రతా బలగాలు అడ్డుకున్నట్టు సమాచారం. ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రి, భారీగా ఆయుదాలను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు వెంబడి భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.