Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

VED

శ్రీనగర్ : కశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కర్ -ఎ-తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ డిజిపి ఎస్‌పి వేద్ తెలిపారు. ఘటనాస్థలిలో మరో నాలుగు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయని ఆయన చెప్పారు. ఎన్‌కౌంటర్ అయిన ఉగ్రవాదుల నుంచి రెండు తుపాకులు, భారీ ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Two Terrorists Encounter in Shopian

Comments

comments