Thursday, April 18, 2024

ఇద్దరు దొంగల అరెస్టు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జల్సా లకు బానిసై దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకుని తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చేసుకొని దొంగతనా లకు పాల్పడుతున్న విజయపురికాలనీ రేకుర్తికి చెందిన కుంచం అశోక్ (35), కుంచం రవి (24) అను ఇద్దరు దొంగలను సోమవారం కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు పట్టుకుని వారి వద్ద నుండి బంగారు గాజుల జత (29) గ్రాములు, 15 గ్రాముల బంగారు నెక్లెస్, 8 గ్రాముల బాంగారు ముద్ద, ఒక బంగారు ముక్కు పుడక, రూ. 40 వేల నగదు, ఒక I phone 14.pro విలువ సుమారు లక్ష 30 వేలు, ఒక vivo phone విలువ సుమారు. 30 వేలు, దొంగిలించిన సుమారు 5 లక్షల 40 వేల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు తెలిపారు.

ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం… ఇటీవల అలకాపురి కాలనీ, సిక్కువాడ, కోతిరాంపూర్ కరీంనగర్ -1 టౌన్ పరిధిలో జరిగిన పలు దొంగతనాల సంఘట నలలో కేసు నమోదు చేసుకున్న కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు దొంగల ఆచూకీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కొని అతి తక్కువ కాలంలోనే కేసులను చేదించడం జరిగిందని తెలిపారు.

ఇందులో భాగంగా కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ ఆధ్వర్యంలో కేసులను ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ ప్రత్యేక బృందాలు సిబ్బంది పలు సీసీ కెమెరాలు పరిశీలించి ఆ సీసీ కెమెరాలలో ఇద్దరు దొంగల కదిలికలను గమనించడం జరిగిందని పేర్కొన్నారు. వారిని రేకుర్తికి చెందిన కుంచం అశోక్ అతడి తమ్ముడు రవిగా గుర్తించి వారి పై నిఘా వేయడం జరిగిందని వివరించారు.

పోలీస్‌ల నిఘాను గమనించిన నిందితులు ఇక్కడ ఉంటే పోలీస్‌లకు దొరికి పోతామని, కరీంనగర్ నుండి యాదాద్రి కి వెళ్లి తల దాచు కునే ప్రయత్నం చేయగా వారి కదలికలను నిశితంగా గమనిస్తున్న పోలీస్‌లు యాదద్రి కి చేరుకోగా అక్కడ నుండి కూడా జారుకున్న నిందితులు హైదరాబాద్, వరంగల్ , రామగుండం మొదలైన ప్రాంతాలను తిరుగుతూ సోమవారం కరీంనగర్ చేరుకోగా సదరు నిందితులను పోలీసులు చాక చక్యంగా పట్టుకున్నారని తెలిపారు.

ఈ కేసును చాకచక్యంగా చేదించి దొంగలను పట్టుకోవడంలో శ్రమించిన కరీంనగర్ వన్ టౌన్ ప్రత్యేక బృందాలు, క్రైమ్ సిబ్బంది వన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్ రవికుమార్, HC భూమయ్య, HC హస్సేన్, ASI చాంద్‌పాషా, మొహమ్మద్ బషీర్ కానిస్టేబుల్‌లను ఈ సందర్భంగా ఏసీపీ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News