Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఇద్దరు టివి ఆర్టిస్టులు

prostitute

హైదరాబాద్ : అన్‌లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు టివి ఆర్టిస్టులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. లగ్జరీల కోసం హైటెక్ వ్యభిచారం ప్రారంభించిన ఓ జూనియర్ అర్టిస్టు, మరో నటితో పాటు మేకప్‌మెన్ భండారినికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్‌లో ఓ నివాసంలో ఉంటూ వీరు ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అన్‌లైన్ వ్యభిచారంపై పోలీసులు నిఘా పెట్టిన నేపథ్యంలో వీరు అన్‌లైన్‌లో బోడుప్పల్‌కు చెందిన వారితో బేరం కుదుర్చుకొని వెళ్లి అక్కడ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Comments

comments