Search
Sunday 18 November 2018
  • :
  • :

టూవీలర్ సంస్థలకు రూ.600 కోట్ల నష్టం

Bikes

ముంబయి: బిఎస్-3 వాహనాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించిన తర్వాత వాటిని సేల్ చేసేందుకు మూడు రోజులపాటు డిస్కౌంట్లు ప్రకటించినందుకు గాను పరిశ్రమకు దాదాపు రూ.600 కోట్ల నష్టమేర్పడింది. ఈ మేరకు రేటింగ్ సంస్థ ఐసిఆర్‌ఎ నివేదికను ప్రకటించింది. డిస్కౌంట్లు ప్రకటించినప్పటికీ అమ్ముడుపోని వాహనాలు కూడా ఉన్నాయి. వీటిని బిఎస్-4 వాహనాలుగా మార్చడమే ప్రత్యామ్నాయంగా ఉందని నివేదిక తెలిపింది. బిఎస్(భారత్ స్టేట్)-3 వాహనాలపై మార్చి 29న సుప్రీం కోర్టు నిషేధం విధించింది. ఏప్రిల్ 1 నుంచి బిఎస్-4 వాహనాలను మాత్రమే విక్రయించాలని సూచించింది.

వాహనాల ఉద్గారాలపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. దీంతో ఉన్న రెండు రోజుల వ్యవధిలోనే ఉన్న స్టాక్ ను క్లియర్ చేసుకోవడం కోసం బంపర్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. 2017 మార్చి 30-31లలో ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్లతో ద్విచక్ర వాహన పరిశ్రమకు వచ్చిన నష్టం రూ.600 కోట్లు ఉండొచ్చని ఐక్రా వెల్లడించింది. బిఎస్-4 ప్రమాణాలతో ప్రస్తుతమున్న ఉద్గారాల స్థాయిని కఠినతరం చేయొచ్చని, అంతేకాక, నైట్రోజన్ ఆక్సైడ్స్ లపై అదనంగా పరిమితులు విధించవచ్చని తెలిపారు. నష్టాలు మాత్రమే కాక ఇటు నిర్వహణ లాభాలపైనా దీన్ని ప్రభావం పడనుందట. మార్చి 30-31లోని భారీ డిస్కౌంట్లతో టూవీలర్ ఒఇఎమ్స్ నిర్వహణ లాభాలపై 150-165 బిపిఎస్ ప్రభావం చూపనుందని ఐక్రా అంచనావేస్తోంది. 2010 నుంచి కంపెనీలు బిఎస్-3 ప్రమాణాలు పాటిస్తూ వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి.

Comments

comments