Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

వేగవంతమైన వైద్యసేవలకు ద్విచక్ర వాహనాలు

crowd

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు వేగవంతంగా ఉత్తమ ఉచిత వైద్య సేవలందించుటకు వీలుగా ఎఎప్‌ఎంలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమాత్యులు ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం  సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయములో కుటుంబ సంక్షేమ శాఖ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెక్కల పథకంలో భాగంగా 10 వేల సబ్సిడితో ఎఎన్‌ఎం లకు ద్విచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమాన్నికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వైద్యానికి ఎన్నో కోట్లు వెచ్చించి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని 30 పడకల ఆసుపత్రిగా, 30 పడకల ఆసుపత్రిని, 50 పడకల ఆసుపత్రిగా, ఆప్‌గ్రేడ్ చేశామని అన్నారు. అన్ని ఆసుపత్రులలో తగిన మౌళిక వసతులు కల్పించామని, వైద్య పరికరాలు సమకూర్చామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన బాలింతలకు ఆడపిల్ల తల్లులకు 13 వేలు, మగబిడ్డ తల్లులకు 12 వేలతో పాటు కెసిఆర్ కిట్‌లను ఇస్తున్నామని తెలిపారు. కెసిఆర్ కిట్ల వలన ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలలో నమ్మకం పెరిగిందని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. జిల్లాలో 178 మంది ఎఎన్‌ఎంలు ద్విచక్ర వాహనాలకు దరఖాస్తు చేసుకొగా మొదటి విడతగా 125 మందికి వాహనాలు మంజూరైనాయని త్వరలో మిగిలినవారికి కూడా మంజూరు అయితాయన తెలిపారు. ఎఎన్‌ఎంలు మండలాలలో వివిధ గ్రామాలకు ఆటోలను ఆశ్రయించకుండా ద్విచక్ర వాహనాలు పై వెళ్లి వైద్య సేవలు అందించుటకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుజాత, డాక్టర్ జువేరియా, మాస్ మీడియా అధికారి దుర్గరావు, డిప్యూటీ డెమో ఉషారాణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

comments