Search
Tuesday 20 November 2018
  • :
  • :

రైలులో ఇద్దరు మహిళలపై హత్యచారం..

  Two Women Found Dead In Toilets Of Assam Trains

గువహాటి: ప్రయాణిస్తున్న రైలు లో ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి, హత్యకు పాల్పడిన  సంఘటన అసోంలో చోటు చేసుకుంది. అసోం వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థిని మృతదేహాన్ని శివసాగర్‌ జిల్లాలోని సిమలుగురి రైల్వే స్టేషన్‌లో గుర్తించారు. మరో మహిళ మృతదేహాన్ని శుక్రవారం జోర్హాత్‌ జిల్లాలోని మరియాని స్టేషన్‌ వద్ద అవధ్‌ అస్సాం ఎక్స్‌ప్రెస్‌లో కనుగొన్నారు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితులు వికాస్ దాస్, విపిన్ పాండేలను దిగ్రూగర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు. సిసిటివి పుటేజి ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

Comments

comments