Home తాజా వార్తలు పిడుగు పడడంతో ఇద్దరు మహిళలు మృతి

పిడుగు పడడంతో ఇద్దరు మహిళలు మృతి

womens-died

మహబూబ్‌నగర్: జిల్లాలోని నాగర్‌కర్నూల్ మండలం పెద్దాపూర్‌లో శుక్రవారం పిడుగు పడడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లి పని చేస్తుండగా మహిళలపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం సిద్ధిల కుంటలో మహిళలు వ్యవసాయ పనులు చేస్తుండగా వారిపై పిడుగు పడింది. దీంతో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.