Home వరంగల్ రూరల్ 20 ఏళ్లలో చేయని అభివృద్ధి చేశాం

20 ఏళ్లలో చేయని అభివృద్ధి చేశాం

Madhusudanachary

శాయంపేట: ఏ ప్రభుత్వం చేయని విధంగా గత 20ఏళ్ళలో చేయని అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం రెండున్నర ఏళ్ళలోనే చేసి చూపించామని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం మండలంలోని కాట్రపల్లి గ్రామం లో సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ కాట్రపల్లి నుండి రాజుపల్లి, సాధనపల్లి, గొల్లపల్లి వరకు రూ 3కోట్లతో బీటి రోడ్లపను వేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌సి,ఎస్‌టి కాలనీలకు రూ.3 లక్షలతో సిసి రోడ్లు, ముదిరాజ్‌లకు రూ.10 లక్షలతో కమ్యూనిటిహాల్ కాట్రపల్లి గ్రామంలో 23 మంది  దళితులకు ఉచ్చితంగా భూమి పంపిణీ చేసినట్లు తెలిపారు.

డిబిఎం 38 ద్వారా చివరి వరకు వీటిని అందిస్తామని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులకు జలకల తెప్పించామని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో మిషన్ భగీరథతో మంచి నీటిని అందిస్తున్నట్లు రానున్న రెండున్నర ఏళ్ళలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలు అభివృద్ధి చేయలేదని తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజుబాయి, ఎంపిటిసి అనిపా, మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం రవీందర్, కో ఆఫ్‌షన్ ఎస్‌కె గౌస్, నాయకులు పోతు రమణారెడ్డి, కర్రు ఆదిరెడ్డి, పల్లె బుచ్చిరెడ్డి, బలిజె నరిసింహరాములు తదితరులు పాల్గొన్నారు.