Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

యువతి కోసం కొట్టుకున్న ఇద్దరు యువకులు!

Two Young Man fight for Girl in Hyderabad

హైదరాబాద్: తాను ప్రేమించిన యువతిని మరో వ్యక్తి మాయ మాటలతో తన వద్ద ఉంచుకున్నాడంటూ ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి వీరంగం సృష్టించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయవాడ మాచవరంకు చెందిన రేవంత్‌ ఇంజినీరింగ్ చదివే సమయంలో తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ గత ఐదేళ్లుగా   ప్రేమించుకున్నారు. అయితే, ఇటీవల రేవంత్‌ ప్రవర్తనలో మార్పు రావడంతో యువతి అతడితో బ్రేకప్‌ చేసుకుంది. అనంతరం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3 అరోరాకాలనీలో ఉంటున్న తన స్నేహితుడు అఖిల్‌(26) వద్దకు వచ్చింది. ప్రైవేటు జాబ్ చేస్తున్న అఖిల్‌ ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు.

ఈ విషయం కాస్తా రేవంత్ కు తెలియడంతో కొద్దిరోజులుగా ఆమెను అక్కడి నుంచి వచ్చేయాలని బెదిరిస్తున్నాడు. అలాగే తన ప్రియురాలికి ఆశ్రయం ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అఖిల్‌కు ఫోన్‌లో బెదిరించాడు. రేవంత్ బెదిరింపులను యువతి, అఖిల్ పట్టించుకోలేదు. దీంతో ఆదివారం రేవంత్ తన 30 మంది మిత్రులతో కలిసి ఆరోరా కాలనీకి వచ్చి అఖిల్ ఇంటివద్ద వీరంగం సృష్టించాడు. నా ప్రియురాలిని మాయ మాటలతో మభ్యపెట్టి నీ వద్ద ఉంచుకుంటావా అంటూ అఖిల్‌పై దాడికి దిగాడు. ఈ ఘర్షణలో అఖిల్‌తో పాటు అతడి స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో యువతితో పాటు అఖిల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్, అతడి మిత్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

comments