Home ఆంధ్రప్రదేశ్ వార్తలు చెరువులో పడి ఇద్దరు మృతి

చెరువులో పడి ఇద్దరు మృతి

Pondకృష్ణా : గన్నవరంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. కోనాయి చెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు యువకులు చనిపోయారు. మృతులను ప్రకాశం జిల్లా సింగరాయి కొండ, కావలికి చెందిన షేక్ మస్తాన్ భాషా, కరీంభాషాలుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరు ఈత కోసం వచ్చి చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. మస్తాన్ బాషా పాలిటెక్నిక్ చదువుతుండగా, కరీం హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ చదువుతున్నాడు.  వేసవి సెలవుల్లో సరదాగా గడిపేందుకు  గన్నవరంలోని బంధువుల ఇంటికి వచ్చి మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. షేక్ మస్తాన్ భాషా, కరీంభాషాలు అన్నదమ్ముల పిల్లలు కావడం గమనార్హం. పోస్టుమార్టం కోసం షేక్ మస్తాన్ భాషా, కరీంభాషాల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Two Young Men Dead with Drown In Pond