Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

శాంసంగ్‌కు భారీ జరిమానా!

U.S. federal court orders Samsung to pay Apple US$533m in iPhone case

దక్షిణ కోరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారు శాంసంగ్‌కు అమెరికా న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. ఐఫోన్‌కు కాపీరైట్ ఉన్న డిజైన్ ఫీచర్లను అనుమతి లేకుండా వాడినందుకు గాను శాంసంగ్‌కు 533 మిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 3,644 కోట్లు) భారీ ఫైన్ వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. తమ పేటెంట్ల ఫీచర్లను శాంసంగ్ వినియోగించుకోవడం వల్ల తమ కంపెనీ ఎంతో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని నష్టపరిహారంగా తమకు బిలియన్ డాలర్లు ఇప్పించాలని యాపిల్ డిమాండ్ చేసింది. యాపిల్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం శాంసంగ్‌కు 533 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తున్నట్టు తీర్పును ఇచ్చింది. ప్రొడక్టు డిజైనింగ్ సహా ప్యాకేజింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్ తదితర అంశాల్లో శాంసంగ్ కాపీకొడుతోందని ఈ సందర్భంగా యాపిల్ పేర్కొంది.

Comments

comments