Search
Thursday 15 November 2018
  • :
  • :

సిద్ధమైన మిస్టరీ థ్రిల్లర్

Samantha

సమంత అక్కినేని, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. సెప్టెంబర్ 13న విడుదలకానున్న ఈ చిత్రానికి పవన్‌కుమార్ దర్శకుడు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు, తమిళ్‌లో కలిపి ట్రైలర్‌కు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ‘యు టర్న్’ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌లో ఒకేసారి తెరకెక్కించారు. రెండు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది ఈ చిత్రం. రాహుల్ రవీంద్రన్, భూమికా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్ని అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ కానుంది. సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్‌లపై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్ట్‌ః ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటర్‌ః సురేష్ ఆర్ముగం.

Comments

comments