Home Default మోడీకి యుఎఇ పురస్కారం

మోడీకి యుఎఇ పురస్కారం

PM Modiదుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం జాయెద్ మెడల్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీని  సత్కరించనుంది. ఆ దేశ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ ఈ అవార్డును మోడీకి ఇస్తున్నట్లు మీడియాకు తెలిపారు. వివిధ దేశాల అధ్యక్షులు, రాజులు, దేశాధినేతలకు యుఎఇ ప్రభుత్వం  ఈ అవార్డు ప్రదానం చేస్తుంది. భారత్, యుఎఇ మధ్య సంబంధాలను బలోపేతం చేసిన కారణంగా మోడీకి ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ దేశం వెల్లడించింది. రెండు దేశాల మధ్య చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను మోడీ మరోసారి బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారని, అందుకే ఆయనకు యుఎఇ అత్యున్నత పురస్కారం జాయెద్ మెడల్ ఇవ్వాలని అధ్యక్షుడు నిర్ణయించారని క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బిన్ జాయెద్ తెలిపారు. మోడీకి ఈ అవార్డు రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులు మోడీకి శుభాభివందనలు తెలిపారు.

UAE Best Civilian Award to PM Narendra Modi