Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం..

mahila*ఇంటి ఎదుట బైఠాయించిన మహిళలు
మనతెలంగాణ/యైటింక్లయిన్‌కాలనీ: ఉద్యోగాలిస్తానని చెప్పి వేలాది రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకుండా తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి ఇంటి ఎదుట మహిళలు బై ఠాయించి నిరసన తెలిపిన సంఘటన రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 8వ కాలనీలో జ రిగింది. వివరాల్లోకి వెళితే.. 43వ డివిజన్ సంతోష్‌నగర్‌కు చెందిన చెవుల శ్రీనివాస్ ఎన్‌టిపిసిలోని క్యాంటీన్‌లో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి వెంకట్రావ్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కెకెనగర్‌కు చెందిన 14 మంది మహిళల వద్ద సంవత్సరం క్రితం ఒక్కోక్కరి వద్ద పదివేలు వసూలు చేశాడు. ఉద్యోగాల కోసంఎన్నిసార్లు అడిగినా వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఇంటికి తాళం వేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. బుధవారం మహిళలు శ్రీనివాస్ ఇంటి ముందు బైఠాయించారు.తమ డబ్బులు తమకు ఇవ్వాలని సరస్వతి, మణెమ్మ, పద్మ, పోచమ్మ, సరోజ, స్రవంతి డిమాండ్ చేశారు.

Comments

comments