Search
Thursday 15 November 2018
  • :
  • :

వెనుక బడిన తరగతులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌లు

v
మంగపేట: మండలంలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈబీసీ, ఓబీసీ,మైనార్టీలకు ఉచితంగా ఉజ్వల యోజనపథకం కింద గ్యాస్ కనెక్షన్‌లను పంపిణీ చేయబడుతున్నట్టు బీజేపీ మండల అద్యక్షులు చిలకమర్రి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉజ్వల యోజన పథకం కింద ప్రధాన మంత్రి పేద మద్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌లను అందివ్వడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన వారు ఆధార్‌కార్డు జీరాక్స్ కాపీ,రేషన్ కార్డుజీరాక్స్, కులసర్టిఫికేట్,బ్యాంకు అకౌంట్ నంబర్, రెండు ఫోటోలు, ఇంటిలోని ఎవరిదైనా సెల్‌నంబర్‌ను ఆయా గ్రామాల బీజేపీ కార్యక్తలకు అందజేయాలని కోరారు. సమావేశంలో కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు భీమినేని శివ,కున్నం వెంకటరెడ్డి,ప్రధాన కార్యదర్శి గంధసిరి శ్రీనివాస్,కిసాన్ మోర్చా మండల అద్యక్షులు సప్పిడి శ్రీనివాస్,యువమోర్చా మండల అద్యక్షులు భీమినేని సామంత కుమార్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments