Home ఆఫ్ బీట్ శస్త్ర చికిత్సలు చేయడంలో దిట్ట

శస్త్ర చికిత్సలు చేయడంలో దిట్ట

World's-Smallest-Surgical-R

హెర్నియా చికిత్స, పెద్దపేగు, ప్రొస్టేట్, చెవి, ముక్కు, గొంతు వంటి సంక్లిష్ట శస్త్రచికిత్సలు సులభంగా చేయగల రోబోను లండన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. మొబైల్ ఫోన్లు, అంతరిక్ష కేంద్రంలో వాడే సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఈ రోబో పేరు వెర్సైస్. ప్రపంచంలో శస్త్రచికిత్సలు చేయగల రోబోల్లో వెర్సైస్ అతి చిన్నది. మనిషి చేతిని పోలి ఉండే ఈ రోబో సాయంతో సంప్రదాయ ఆపరేషన్లలో లాగా పెద్ద గాట్లు పెట్టనవసరం లేకుండా శస్త్రచిక్తిత్స చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

దీంతో రక్తస్రావం తక్కువగా జరగడమే కాకుండా రోగికి నొప్పి కూడా ఉండదు. త్రీడీ తెర సాయంతో దీనిని నియంత్రించవచ్చు. వచ్చే ఏడాది లాంఛనంగా ప్రారంభించనున్నారు.  ముందుగా లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేసేందుకు ఉపయోగించ నున్నట్లు కేంబ్రిడ్జ్ మెడికల్ రోబోటిక్స్ శాస్త్రవేత్త మార్టిన్ ఫ్రోస్ట్ వెల్లడించారు. ఈ రోబో ద్వారా చేసే సర్జరీ వల్ల ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. రోగి కోలుకోవడానికి కూడా తక్కువ వ్యవధే పడుతుందని వారు అంటున్నారు.