Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రామమందిరం నిర్మాణంపై ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు

BJP Win Uttar pradesh and UP Develop Rapidly Said by Uma Bharati

లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను చాలా నమ్మకంగా ఉన్నానని, మందిరం నిర్మాణంపై అపారగౌరవం ఉందని, ఇందులో భాగంగా తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు. శనివారం ఆమె యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత అంశంపై తిరిగి విచారణ చేయాలని ఇటీవల దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వులో ఉంచింది. ఈ క్రమంలో  మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఉమాభారతి సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.

Comments

comments