Home అంతర్జాతీయ వార్తలు నిక్కీ హేలీ రాజీనామా

నిక్కీ హేలీ రాజీనామా

ఆమోదించిన ట్రంప్‌ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ

Nickey

వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమె రాజీనామాను ఆమోదించారని ఆక్సియోస్ న్యూస్ సైట్ తెలిపింది. ఆమె రాజీనామా చేశారని రెండు విశ్వసనీయ వర్గాలు వెల్లడిం చాయని ఆక్సియోస్ పేర్కొంది. హేలీ గతవా రం వైట్ హౌస్‌లో ట్రంప్‌ను కలిసి తన రాజీ నామా అంశాన్ని చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఇలా ఉండగా మంగళవారం ఉదయం హేలీ ఒక కార్యక్రమంలో ట్రంప్‌ను కలిశారు.

‘ఉదయం 10.30కి ఓవల్ ఆఫీస్‌లో నా స్నేహితురాలు నిక్కీ హాలేకు సంబంధించి ఒక ప్రకటన వెలువడుతుంది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. వైట్ హౌస్ ప్రతినిధి సారా శాండర్ష్ అంతకుముందు మాట్లాడుతూ…వీరిద్దరూ మీడియా సమక్షంలో కలుసుకుంటారు…అని తెలిపారు. ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయమైన సలహాదారుల్లో హేలీ ఒకరు. అయితే, మంగళవారం హేలీ వైట్ హౌస్‌కు వెళ్లిన సమయంలో తన రాజీనామా విషయం ధ్రువీకరించలేదు.

UN Ambassador Nikki Haley Resign

Telangana news