Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రెండిళ్లకో క్యాన్సర్ రోగి

 Underground waters are toxic with Sterilite Factory

తూత్తుకుడి: ప్రజా గ్రహానికి తలొగ్గి తమిళనాడులోని స్టెరిలైట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయమైతే తీసుకుంది కానీ ఈ ఫ్యాక్టరీ కారణంగా దాని చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కలిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్త్తుందనేది ప్రశ్న. ఫ్యాక్టరీని మూసి వేయాలంటూ ఆందోళన చేస్తున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలపై ఇటీవల పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఆయితే బయటి ప్రపంచానికి తెలియని చీకటి కోణాలు ఎన్నో దీని వెనక ఉన్నాయి. పర్యావరణ నిబంధనలకు గాలికి వదిలేసి అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా ఉత్పత్తి కొనసాగిస్త్తున్న స్టెరిలైట్ ఫ్యాక్టరీ కారణంగా దాని చుట్టుపక్కల గ్రామాలకు కలిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఫ్యాక్టరీ వ్యర్థాల కారణంగా తాగు నీటి బావులతో పాటు వ్యవసాయ బావులు సైతం విషతుల్యంగా మారాయి. ఫలితంగా పంటలు దెబ్బతినడంతో పాటు గామ్రాల్లోని జనాల ఆరోగ్యాలు సైతం దెబ్బతిన్నాయి. అందుకు సజీవ నిదర్శనం సిల్వర్ పురంగా పిలవబడే గ్రామమే. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ప్రతి రెండిళ్లకో క్యాన్సర్ రోగి ఉన్నారంటే నమ్మశక్యం కాదు. కానీఅది కఠోర సత్యం. సంపాదించే భర్తలను కోల్పోయి, వేరే ఆధారం లేక కూలీ నాలీ చేసుకుంటూ తమతో పాటు తమ బిడ్డలను పోషించుకొంటున్న వారు కొందరైతే, లివర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల కారణంగా కొంపా, గోడు అమ్ముకొని, జీవచ్ఛవాలుగా బతుకుతున్న వారు మరికొందరు.
భూగర్భ జలాలు విషతుల్యం
దాదాపు రెండువేల జనాభా ఉన్నసిల్వర్‌పురంలో అరవై కుటుంబాల్లో క్యాన్సర్ రోగులున్నారు.తమ ఈ దుస్థ్థితికి స్టెరిలైట్ ఫ్యాక్టరీయే కారణమని వారంతా ముక్తకంఠంతో అంటున్నారు. 31 ఏళ్ల రామలక్ష్మి భర్త మురుగన్ మూడేళ్ల క్రితం పేగు క్యాన్సర్‌తో చనిపోయాడు. ఇప్పుడు ఆమెకు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నెలకు సంపాదించే రెండున్నర వేలతో ఆద్దరు పిల్లలకు కడుపు నివడా తిండి పెట్టడమే కష్టంగా ఉంటే ఇక వారిని చదివించడం ఎంతకష్టమో తలచుకొంటేనే భయమేస్తుంది. రామలక్ష్మి కొడుకు పోలీసు ఆఫీసర్ కావాలని కలలు కంటున్నాడు. కూతురు కలలు మలా ఉన్నాయో తెలియదు కానీ అవి తీరే మార్గం ఉందా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. పక్కింట్లోని మీరా భర్త సుబ్బయ్య ఇటీవలే లివర్ క్యాన్సర్‌తో చనిపోయాడు. అతని చికిత్సకే ఉన్నదంతా తుడిచిపెట్టుకు పోయింది. ఇప్పుడు ఇల్లు గడవడం కోసం మీరా కుమారుడు చదువు మానేసి లారీ క్లీనర్‌గా అవతారమెత్తాల్సి వచ్చింది. అదే వీధిలో నాలుగిళ్ల అవ తల ఉన్న హెలెన్ హెప్సిబా మూత్రపిండాల క్యాన్సర్ తో బాధపడుతోంది. ఇటీవలే ఆపరేషన్ చేసి దెబ్బతిన్న కిడ్నీలలో ఒకదాన్ని తొలగించారు. ఆరేళ్ల క్రితం హెలెన్ స్నేహితురాలు ఎ. రాజసెల్వి తల్లి వెలమాల్ కూడా గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయింది.

ఇలా చెప్పుకొంటే పోతే గ్రామంలోని వారి కన్నీటి గాథలకు అంతే ఉండదు. ఈ దుస్థితికి స్టెరిలైట్ కారణమని వారు అంటున్నారు. ఈ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో సేకరించిన నీటి శాంపిల్స్‌ను పరీక్షించిన తమిళనాడు కాలుష్య నియంతరణ బోర్డు నివేదికలో దిగ్భ్రాంతికర వాప్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడి భూగర్భ జలాల్లో సీసం లాంటి విష పదార్థాలు మామూలుగా ఉండాల్సిన స్థ్థాయికన్నా 39-55 రెట్లు ఎక్కువున్నట్లు బోర్డు వర్గాలు చెప్తున్నాయి. గత ఇరవై ఏళ్లుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కుప్పలుగా పడేసిన ఫ్యాక్టరీ వ్యర్థాలు, ఖనిజంనుంచి రాగిని వేరు చేసిన తర్వాత మిగిలిన వ్యర్థపదార్థం, జిప్సంలాంటి వాటివల్ల సిల్వర్‌పురంలోని భూగర్భ జలాలన్నీ కూడా బాగు చేయలేనంత విషతుల్యంగా మారాయి. ఉపయోగించడానికి వీలు లేని వి ధంగా నీరు కలుషితం కావడంతోచాలా కుంటలు, బోరు బావులు పాడుపడిపోయాయి. గతంలో వీటి నీళ్లను ఉపయోగించే వాళ్లమని, అయితే ఇప్పుడు ఏ సమయంలో వస్తాయో తెలియని నల్లా నీళ్లపైనే ఆధారపడాల్సి వస్తోందని ఇక్బాల్ అనే గ్రామస్థుడు చెప్పాడు.
నిబంధనలకు నీళ్లు
స్టెరిలైట్ పర్యావరణ నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘించిందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యానికి అ త్యంత ప్రమాదకరమైన భారీ కర్మాగారం కేటగిరీ కిందికి ఇది వస్తుంది. అంటే మనుషులు నివసించే ్రప్రాంతాలకు దగ్గర్లో ఉండకూడదు. అయితే ఇది తూత్తుకుడి పట్టణం సరిహద్దుకు కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంది.అంతేకాదు ప్లాంట్ చుట్టూ 25 అడుగుల గ్రీన్‌బెల్ట్‌ను ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉన్నా కంపెనీ దాన్ని పట్టించుకోలేదు. పచ్చదనం మచ్చుకు కూడా అక్కడ కనిపించదు.1996లో ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించినప్పుడు దాని ఉత్పత్తి సామర్థం 44 వేల టన్నులు. అయితే యాజమాన్యం దీన్ని అంచెలంచెలుగా నాలుగు లక్షల ట న్నులకు పెంచింది. అయితే దానికి అనుగుణంగా చిమ్నీ ల ఎత్తును 60 మీటర్లనుంచి 123 మీటర్లకు పెంచలేదు. సిల్వర్‌పురం సమీపంలో అసహ్యంగా, జిడ్డుపట్టిన, శిథిలమైన అనేక పొగ గొట్టాలు కనిపిస్తాయి. ఈ ఫ్యాక్టరీ వల్ల తమ ఆరోగ్యాలకు, పర్యావరణానికి కలిగిన నష్టాన్ని అర్థం చేసుకోవడానికి తమకు పదేళ్లకు పైగా పట్టిందని, అయితే ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల్లో జనం ఎందుకు క్యాన్సర్ వ్యాధిబారిన పడుతున్నారో ప్రభుత్వం ఇప్పటికీ అధ్యయనం చేయలేదని స్థానికులు అన్నారు.

Comments

comments