Home ఎడిటోరియల్ తప్పు విద్యాశాఖ అధికారులది – శిక్ష నిరుద్యోగులకా!

తప్పు విద్యాశాఖ అధికారులది – శిక్ష నిరుద్యోగులకా!

17  సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న డిఎస్‌సి 98 క్వాలిఫైడ్ టీచర్లు 

Dsc“మీకు సీమాంధ్ర పాలకులు అన్యాయం చేసిండ్రు”. “మీ సమస్య నాకు తెలుసు”, “మీకు న్యాయం చేస్తా” అని ముఖ్యమంత్రి కెసిఆర్ డిఎస్‌సి 98 క్వాలిఫైడ్ టీచర్లకు హామీ ఇచ్చారు. గత ఆరునెలలుగా డిఎస్‌సి క్వాలిఫైడ్ టీచర్లు కొండంత ఆశతో ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన సుమారు వెయ్యిమంది సచివాలయం చుట్టూ, విద్యాశాఖమంత్రి చుట్టు కాళ్లరిగేటట్లు తిరుగుతున్నారు.
జూన్ 6న ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యాశాఖ మీద సమీక్షసమావేశం నిర్వహించారు. టీచర్ల బదిలీలు, రేషనలైజేషన్ తర్వాత డిఎస్‌సి-98 నుండి డిఎస్‌సి -2012 దాక, జరిగిన ఉపాధ్యాయ ఎంపిక కమిటీలలో అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయాలని విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరికి ఆదేశాలు ఇచ్చారు.
2014 జూన్ 2న, సిఎం అయ్యాక, న్యాయం చేయటానికి అప్పటి విద్యాశాఖ మంత్రి, జగదీప్‌రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు.
2014లో డిఎస్‌సి 98 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమనే తమ ఆదేశాలు అమలు చేయ నందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సుప్రీం కోర్టుకు హాజరయ్యా రు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వానికి కొంత టైమ్ ఇవ్వాలనీ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ సుప్రీం కోర్టుకు స్వయంగా హాజరై విన్నవించారు.
గత జూన్, జులై నెలలో టీచర్ల బదిలీలు, రేషన లైజేషన్ పూర్తి అయింది. ఆగస్టు నెల 15లోగా పాత డిఎస్‌సి (98 నుండి 2012 దాకా)లలో మిగిలిన వారికి న్యాయం చేశాక, కొత్త డిఎస్‌సి గురించి విధాన ప్రకటన చేస్తా మని విద్యాశాఖ అధికారులు ప్రక టించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎనిమిదివేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని,వాటిని ఈనెల ఇరవైలోగా అర్హులైన విద్యావాలంటీర్లతో భర్తీ చేస్తామని, వచ్చే జూన్‌లోపు డిఎస్‌సి నిర్ణయిస్తామని విద్యామంత్రి కడియం శ్రీహరి, టీచర్స్‌డే సందేశంలో పేర్కొన్నారు. టీచర్స్‌డే నాడు పాత డిఎస్‌సి అభ్యర్థులకు న్యాయం చేస్తారనే ప్రకటన వస్తుందని కొండంత ఆశతో ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది.
గతంలోకి వెళితే – కరీంనగర్ జిల్లాలో 2300 పోస్టులకు డిఎస్‌సి 98 టీచర్ నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్‌సి 98 రాత పరీక్షలో ‘కటాఫ్’ మార్కులు రాక అధికసంఖ్యలో టీచర్ పోస్టు లు మిగిలిపోయాయి. మొద టి జాబితా విడుదల చేసిన సమయంలో కరీం నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో ఉప ఎన్నికలు ఉండటంవల్ల, రాత పరీక్ష లో నెగ్గిన వారి నంబర్లు జిల్లా కలెక్టర్లు ప్రకటించలేదు. డిఎస్‌సి 98 లో రాత పరీక్షలో ఒసిలకు 50, బిసిలకు 45, ఎస్‌సి, ఎస్‌టిలకు 40మార్కులు వస్తేనే ఇంటర్వూ కు, ఉద్యోగానికి అర్హులని నోటిఫికేషన్ ఇచ్చారు.
అప్పట్లో కటాఫ్ ప్రకారం పదిహేడు జిల్లాల్లో భారీ సంఖ్యలో టీచర్‌పోస్టులు ఖాళీ గా మిగిలినవి. దీనితో అప్పటి టిడిపి సర్కారు ఒసి, బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు ఐదుమార్కు లు చొప్పున తగ్గించి, ఇంటర్వూకు పిలిచారు. రాతపరీక్ష, ఇంటర్వూ, మార్కులు కలిపి మెరిట్ లిస్టు పెట్టి ఉద్యోగానికి ఎంపిక చేయాలి. కాని రాతపరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వూలలో జీరో, ఒకటి మార్కులు వేశారు. రాతపరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినవారి దగ్గర లంచాలు తీసుకొని పదిహేను మార్కులకుగాను, పదిహేను మార్కులు వేసారు. సమాచార హక్కు చట్టం రావడంతో 2006లో ఇంటర్వూ మార్కుల అవినీతి బయట పడింది.డిఎస్‌సి 98 ఇంటర్వూ బోర్డులోని సభ్యులు పెన్సిల్ ద్వారా మార్కులు వేసి, తుది జాబితా సమయంలో దిద్దినారు. 50కిపైగా మార్కులు వచ్చినవారు టీచర్ ఎంపిక జాబితా లిస్టులో లేరు. రాతపరీక్షలో 35, 30మార్కులు వచ్చినవారిని తుది జాబితాలో ఎంపిక చేశారు. డిఎస్‌సి 98 ఇంటర్వూలో అవినీతి జరిగిందని రాష్ట్రస్థాయి ఉద్యమం జరిగింది. దాంతో టీచర్ పోస్టులకు ఇంటర్వూను చంద్రబాబు సర్కారు రద్దు చేసింది. నాన్‌లోకల్ ఆంధ్రవారికి తెలంగాణలో ఓపెన్ మెరిట్‌లో 30శాతం పోస్టులు ఇచ్చారు. ఇలా ఎన్నో రకాలుగా అప్పటి డిఇవోలు, కలెక్టర్లు, టీచర్‌ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడ్డారు.
కోర్టు ఆదేశం
ఎట్టకేలకు 2011 నవంబర్ 24న జస్టిస్ రఘురాం, జస్టిస్ కృష్ణ మోహన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ 98 క్వాలిఫైడ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీంతో నిరుద్యోగుల జీవితాలలో ఆశలు చిగురించాయి. కాని ప్రభుత్వాల వైఖరివల్ల ఫలితం చేకూరలేదు. ఆగస్టు 24న సుప్రీంకోర్టు కేసు వాయిదా పడింది. 17ఏళ్లుగా తిరుగుతూ ఏజ్‌బార్ అయిన వారికి న్యాయం చేయాలి.
-9848811424