Search
Sunday 18 November 2018
  • :
  • :

నిరుద్యోగుల జాతర

Untitled-2

కరీంనగర్: యువతకు ఉపాధి కల్పించేందుకు నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది. యువతకు భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగా గురువారం వారధి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాతో నగరంలోని అంబేద్కర్ స్టేడియం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. దాదాపు 10 వేల మందికి పైగా అభ్యర్థులు రావడంతో ఎటుచూసినా జాతరను తలపించింది. కొంతకాలంగా వారధిలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగ యువతకు దీంతో ఉపాధి దొరికిట్లయింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించన ఈ మేళాలో వివిధ ప్రైవేట్ కంపెనీలకు చెందిన స్టాల్స్‌లో అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించి, 3500 మందికి స్పాట్‌బేస్‌డ్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లిచ్చారు.

ఈ సందర్భంగా ఉద్యోగాలు లభించిన యువత జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపగా, యువత భవితను దృష్టిలో పెట్టుకొని మొదలుపెట్టిన వారధి నిర్వహించిన మెగాజాబ్ మేళాకు స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమానికి ఎంపి వినోద్ కుమార్, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, ఎంఎల్‌ఎ బొడిగె శోభ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, అడిషనల్ జెసి డా. నాగేంద్ర, వారధి సంస్థ కో-ఆర్డినేటర్ అంజనేయులు, డిఆర్‌డిఎ పిడి అరుణశ్రీ, అడిషనల్ పిడి డా.రమేశ్, నగర మేయర్ రవీందర్ సింగ్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పాల్గొని ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు తెలిపారు.

Comments

comments