Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

కొలువు కలేనా?

Un-Employement-Rally

రోజురోజుకూ మీదపడుతున్న వయస్సు
జాడలేని ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగులుల్లో పెరుగుతున్న నిరాశ

ఖమ్మం కలెక్టరేట్: ఉన్నత చదువులు చదివి సొంత రాష్ట్రంలో సర్కారు కొలువులోస్తాయని కొండంత ఆశపెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగులు భయంతో కూరుకుపోతున్నారు. ప్రభుత్వోద్యోగం రాదనే బాధతో అక్కడక్కడ నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వయస్సు మీద పడుతున్న ఇంకా“ ప్రభుత్వోద్యోగం” రాలేదన్న బెంగ నిరుద్యోగులకు నిస్పృహకు లోను చేస్తుంది. 35 ఏళ్లు వచ్చిన ఇప్పటికి తల్లిదండ్రుల పైనే ఆధారపడాల్సి వస్తోందని నిరుద్యోగ యువకులు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో నిరుద్యోగులే ఎక్కువగా పాలుపంచుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన నేటి తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఎన్నికలకు ముందు ఏడాదికి లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి లక్ష ఉద్యోగాలు కాదు కదా, 10 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయటం లేదని నిరుద్యోగ యువకులు వాపోతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ భారీగానే ఉంటుందని భావించిన నిరుద్యోగ యువకులకు నిరాశే మిగులుతోంది. ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సార్ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం బాధకరం.

కొలువుల ఆశ ఎప్పుడు తీరునో…
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి టిపిపీ ఏస్సీకి పాలక వర్గం కూడా ఏర్పంది. కానీ ఇప్పటి వరకు అరకొర నోటిఫికేషన్లు తప్ప ఏమి కనిపించటం లేదు. ఇప్పటికే అన్ని వర్గాల నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఖాళీల లెక్కలు తెల్చి అధికారులు ప్రభుత్వానికి
నివేదికలు కూడా పంపారు. కానీ ఇంకా నోటిఫికేషన్ల జాడ మాత్రం కనిపించటం లేదు. ఖమ్మం జిల్లాలో టిచర్ పోస్టులు 1,523, పంచాయతీ కార్యదర్శి పోస్టులు 388, పంచాయాతీరాజ్‌లో అంటెండర్ పోస్టులు 160, ఖజానా శాఖలో 47 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటితో పాటు ఉమ్మడి జిల్లాల్లో 41 మండలాలకు కేవలం ఐదుగురు ఎంఈఓలే ఉన్నారు.

మిగత మండలాల్లో అంతా ఇంచార్జి పాలనే కోనసాగుతుంది. వీటితో పాటు పోలీస్ శాఖలో సైతం ఖాళీలు మెండుగానే ఉన్నాయి. అంతేకాక సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 34 ఖాళీలు ఉండగా వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ శాఖల్లో ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి అధికారులు లెక్కలు పంపారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అభయం రావటం లేదు. ఇప్పటికే జిల్లాలో 34 ఏళ్లు పైబడిన నిరుద్యోగులు 20 వేల మందికి పైగానే ఉన్నారు. వీరందరికి వయో పరిమితి సడలింపు ఇస్తేనే అవకాశం ఉంటుంది. లేకుంటే వారు శాశ్వతంగా నిరుద్యోగులుగా మిగిలిపోయే అవకాశం ఉంది.

Comments

comments