Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జయలలిత డిఎన్‌ఎ కేసులో ఊహించని మలుపు

Unexpected Turn of Jayalalithaa DNA Case

చెన్నయ్ : తమిళనాడు దివంగత సిఎం జయలలిత డిఎన్‌ఎ పరీక్ష కేసు ఊహించని మలుపు తిరిగింది. ఓ యువతి తాను జయలలిత కూతురునంటూ కోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఆమె వేసిన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతుంది. తనకు డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించాలని ఆ యువతి కోరుతోన్న విషయం విదితమే. 2016లో అనారోగ్యంతో జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరినప్పుడు ఆమెకు సంబంధించిన బయోలాజికల్ నమూనాలను సేకరించి ఉంచారా అని, ఈ విషయంపై సమాచారం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. అయితే జయలలితకు సంబంధించిన బయోలాజికల్ నమూనాలు ఏమీ తమ వద్ద లేవని ఆస్పత్రి యాజమాన్యం కోర్టుకు తెలిపింది. బెంగళూరుకు చెందిన ఓ యువతి తాను జయలలిత కుమార్తెనంటూ చెబుతున్న విషయం విదితమే. తాను జయ కూతురునని నిర్ధారించేందుకు డిఎన్‌ఎ పరీక్ష చేయాలని ఆ యువతి డిమాండ్ చేస్తోంది. దీనిపై ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించి, హైకోర్టుకు వెళ్లాలని ఆ సూచించింది. దీంతో ఆమె మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అనారోగ్యంతో జయలలిత 2016 డిసెంబరు 5న అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. జయ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం జయ మృతిపై విచారణ చేసేందుకు ఓ విచారణ కమిటీని నియమించింది. ప్రస్తుతం ఆ కమిటీ జయ మృతిపై విచారణ చేస్తోంది.

Unexpected Turn of Jayalalithaa DNA Case

Comments

comments