Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రోజంతా ఉల్లాసంగా గడవాలంటే

పొద్దుటే అలారం మోగుతుంది. నిద్రలేవగానే చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అవన్నీ ఎలా చేయాలా?అని టెన్షన్‌కు గురవుతూ ఉంటాం. ముందురోజే మనం ఆ రోజు చేయాల్సిన పని గురించి కొంచెం ప్లాన్‌వేసుకుంటే పనులన్నీ సాఫీగా అయిపోతాయి. రోజంతా ఆనందంగా గడిచిపోతుంది. ఒకసారి మెలకువ వచ్చిన తరువాత మళ్లీ నిద్రపోవటం మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. మీకు ఎన్ని గంటల నిద్ర సరిపోతుందనే విషయం ముందుగా తెలుసుకుని దానికి తగ్గట్టు రాత్రి నిద్రకుపక్రమించాలి. ఈ విధంగా మనకు సరిపోయేలా నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలతోపాటు సామాజిక సంబంధాలు కూడా సరిగా ఉండవని నిపుణులు చెపుతున్నారు.

yoga

* నిద్రలేవగానే కొద్దిసేపు విశ్రాంతిగా ఉండటం మంచిది. లేవగానే సెల్‌ఫోన్‌లో మాట్లాడటం, ఈమెయిల్స్ చూసుకోవటం వంటి పనులు చేయకూడదు.
* నిద్రలేచినాక కూడా మళ్లీ పడుకుంటే ఒత్తిడి అధికమవుతుందని పరిశోధకులు తెలుపున్నారు. నిద్ర సరిపోతే బద్దకించకుండా వెంటనే లేచి పనులు చేసుకుంటే మంచిది.
* రాత్రిపూట గదిలో కిటికి తలుపులు మూసి ఉంచితే చీకటిగా ఉండి త్వరగా నిద్రలోకి జారుకుంటారు. అవసరమైతే కర్టెన్లు వేసుకుంటే వెలుతురు లోనికి రాకుండా ఉంటుంది.
* లేవగానే కాసేపు యోగా, రన్నింగ్, జాగింగ్, వాకింగ్ లాంటివి చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంగా అన్ని పనులు చేసుకోగలుగుతారు. కాసేపు వ్యాయామం తరువాత గ్రీన్ టీ లాంటివి తాగితే మంచిది. డిప్రెషన్ మూడ్ లోకి వెళ్లకుండా ఉండగలుగుతారు.
* ఉదయం 9:30 గంటల ప్రాంతం కాఫీ తాగటానికి అనువైనది. ఉదయం 8 గంటల నుంచి 9 గం. మధ్యలో శరీరం ఒత్తిడిని నిరోధించే కార్టిసాల్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ సమయంలో కాఫీ తాగితే కెఫిన్ శరీరంలోకి విడుదలవుతుంది. దీనివల్ల కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గించటానికి శరీరం శ్రమించటం వల్ల అలసట కలుగుతుంది.
* ఉదయాన్నే పీచు ఉండే ఆహారం, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే మంచిది. వీటిమూలంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఇడ్లీ, దోసె, బ్రెడ్‌లు వంటి టిఫిన్లవల్ల పోషకాలు శరీరానికి అందవు. కేలరీలు తక్కువగా, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు భుజిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Comments

comments