న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం కేంద్రమంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు. సమావేశానికి ముందు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి వర్గం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మంత్రి వర్గం నిర్ణయాలు
- జౌళి రంగంలో భారీగా ఉపాధి కల్పన. దాదాపు 11 లక్షల మందికి ఉపాధి.
- ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించే సంస్కరణలకు ఆమోదం
- భారత్-థాయ్‌లాండ్ మధ్య మాదకద్రవ్యాల నివారణపై ఒప్పందానికి ఆమోదం.
- భారత్-ఆఫ్గాన్ మధ్య శాంతి విషయంలో సహకారంపై ఒప్పందానికి ఆమోదం.
- ముంబయి-పుణె తొలిదశ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
- రైతులకు కొనసాగతున్న రాయితీలు మరో 6 నెలలు పొడిగింపు.
- ఢిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్ విధానంలో మార్పు. ఇకపై జాతీయ పారిశ్రామిక అభివృద్ధి కారిడార్‌గా పరిగణన.