Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

చైనా ఫోన్లతో తస్మాత్ జాగ్రత్త!

Chinese-Mobile-Phones

న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన వివో, ఒప్పో, షియోమి, జియోనీ కంపెనీల ఫోన్లను వాడేందుకు యువత అత్యధికంగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందుబాటు ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఆ కంపెనీలు ఫోన్లు అందిస్తుండమే దీనికి కారణంగా. కానీ ఇప్పుడు ఈ చైనా ఫోన్ల వాడకం ఇప్పుడు వినియోగదారుల కొంపముంచే పరిస్థితి వచ్చింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అపహరణకు గురవుతుందని.. కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు వివో, ఒప్పో, షియోమి, జియోనీ, యాపిల్‌, శాంసంగ్‌తో పాటు దేశీయ కంపైనీ అయిన మైక్రోమ్యాక్స్‌ తదితర కంపెనీలు ఉన్నాయి.

వినియోగదారుడి ఫోన్‌నెంబర్లు, సందేశాలు వంటి వ్యక్తిగత వివరాలను చైనా మొబైల్‌ తయారీ సంస్థలు తస్కరిస్తున్నాయని అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. నోటీసులు పంపిన వాటిలో ఎక్కువ భాగంగా చైనా కంపెనీలే ఉన్నాయి. ఆయా కంపెనీలకు ఈ నెల 28 వరకు గడువు విధించినట్లు ఎలక్ట్రానిక్స్‌, సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. గడువులోగా తాము భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామంటూ సమ్మతి పత్రాన్ని ఆయా కంపెనీలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.

Comments

comments