Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రాజ్యసభకు హాజరైన అరుణ్‌జైట్లీ

Delhi : Union Minister Arun Jaitley to attend Rajya Sabha

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సుమారు మూడు మాసాల అనంతరం రాజ్యసభకు హాజరయ్యారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తరువాత ఆయన సభకు హాజరు కావడం ఇదే మొదటిసారి. మే14న ఆయనకు ఆపరేషన్ జరిగింది. నాటి నుంచి ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆర్థిక శాఖ మంత్రిత్వ బాధ్యతలను మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు. గురువారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జైట్లీ సభకు హాజరయ్యారు. ఈనెల మూడో వారంలో జైట్లీ మళ్లీ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను తిరిగి తీసుకోనున్నారు.

Union Minister Arun Jaitley to attend Rajya Sabha

Comments

comments