Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కేంద్రమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

Union Minister Babul Supriyo Escaped from Accident

ఢిల్లీ : కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారును ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు వెనుక నుంచి ఢీకొంది. కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని మంత్రి ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా హైవే ఫ్లైఓవర్‌పై తన కారును ఓ వోల్వో బస్సు ఢీకొందని ఆయన తెలిపారు. తక్షణమే అప్రమత్తమై డ్రైవర్ కారును ఆపాడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నామని ఆయన పేర్కొన్నారు.

Union Minister Babul Supriyo Escaped from Accident

Comments

comments