Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి

Union Minister Examining the Mission Bhagiradha Works

సంగారెడ్డి : పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట సింగూరు ప్రాజెక్టు వద్ద సాగుతున్న మిషన్ భగీరథ ఇంటెల్ వెల్స్ పనులను కేంద్రమంత్రి రమేశ్ చందప్ప జిగ్‌జినాగి మంగళవారం పరిశీలించారు. ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ఆయన కొనియాడారు. ఈ పథకం ద్వారా ఇంటింటికి సురక్షిత తాగునీరు ఇవ్వడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి భగీరథ పథకానికి ప్రత్యేక గ్రాంట్ వచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అద్భుత పథకాలు అమలు చేస్తున్న సిఎం కెసిఆర్‌ను ఆయన కొనియాడారు.

Union Minister Examining the Mission Bhagiradha Works

Comments

comments