Home జాతీయ వార్తలు స్కర్టులు ధరించకండి.. రాత్రుల్లు ఒంటరిగా తిరగకండి..

స్కర్టులు ధరించకండి.. రాత్రుల్లు ఒంటరిగా తిరగకండి..

Mahesh-Sharmaన్యూఢిల్లీ : కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. భారత్‌కు వచ్చే విదేశీ టూరిస్టులు స్కర్టులు ధరించవద్దని, చిన్న పట్టణాల్లో రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని ఆయన కోరారు. మన దేశానికి వచ్చే విదేశీయులు ఏం చేయాలో, ఏం చేయొద్దో తెలిపే ఓ కరపత్రంలో ఈ సలహా ఇచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో విదేశీయులు అడుగుపెట్టగానే వారికి ఈ కరపత్రాలు అందజేస్తారు. అంతేకాక ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మీరు వాడే వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఫోటో తీసి తమ బంధుమిత్రులకు పంపించాలని కూడా ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు భారత్‌కు విచ్చేసినప్పుడు ఇచ్చే వెల్‌కం కిట్‌లో డూస్ అండ్ డోంట్స్ రాసిన కార్డుపై పర్యాటకులు ముందు జాగ్రత్త సూచనలు చేశామని మహేశ్ శర్మ తెలిపారు. అయితే విదేశీ మహిళలు స్కర్టులు ధరించి రాకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శించారు. మహిళలు ఏం ధరించాలో, ఏం ధరించొదో ఆయన ఏలా నిర్ణయిస్తారని మండిపడ్డారు.
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తాను కేవలం మత సంబంధ ప్రదేశాల గురించి మాత్రమే మాట్లాడానని, మహిళలు ఏం ధరించాలో.. ఏం ధరంచవద్దో తాను కామెంట్ చేయలేదని స్పష్టం చేశారు. మతపరమైన ప్రాంతాలకు సంబంధించి మాట్లాడినప్పుడు ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. ‘అలాగే పర్యాటకులు రాత్రిపూట కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. అందులో తప్పేముంద’ని శర్మ ప్రశ్నించారు. తాను కేవలం వారి భద్రత గురించి ఆలోచించే మాట్లాడనన్నారు.