Search
Wednesday 14 November 2018
  • :
  • :

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి

GOYA-1

తిరుమల : తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం శ్రీవారికి నిర్వహించిన అభిషేకం సేవలో ఆయన తన కుటుంబంతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గోయల్ కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం, శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. తాను ప్రతియేడాది శ్రీవారిని దర్శించుకుంటానని గోయల్ తెలిపారు. దేశ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని తాను శ్రీవారిని కోరుకున్నట్టు ఆయన వెల్లడించారు. తిరుమలలో పూజా కార్యక్రమాలు, దర్శన విధానం, పరిశుభ్రత ఆదర్శనీయంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Union Minister Piyush Goyal Visited the  Tirumala Srivaru Temple

Comments

comments