Home జాతీయ వార్తలు అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయం : జవదేకర్

అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయం : జవదేకర్

Prakash-Javadekar

ఢిల్లీ : అభివృద్ధి విషయంలో తాము రాజకీయాలు చేయబోమని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎపికి ఇప్పటికే చాలా చేశామని, ఇంకా చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేశామని, ఇప్పుడు టిడిపి నేతలు కాంగ్రెస్ నేతలను కలవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఎపి సిఎం చంద్రబాబుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాసిన లేఖలో అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయని, ఆయన రాసిన లేఖలో అన్నీ నిజాలే ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఎపి సిఎం చంద్రదబాబు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. తాము మిత్ర ధర్మానికి విలువ ఇచ్చామని చెప్పారు. మిత్ర ధర్మం కంటే భారత ప్రజలకు, అభివృద్ధికి ఎక్కువ విలువ ఇస్తామని ఆయన తెలిపారు. తమతో టిడిపి తెగదెంపులు చేసుకున్నప్పటికీ ఎపి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

Union Minister Prakash Javadekar Comments On CM Chandrababu