Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

స్మృతి ఇరానీ కనికరించివుంటే..మా నాన్న బ్రతికేదే !

Accident-Case-Smriti-Iraniఆగ్రా: లోక్‌సభలో ప్రజా సమస్యలపై హాట్‌హట్‌గా స్పందించే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన తండ్రి మృతికి కారకురాలని ఇటీవల యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ఓ వైద్యుడి కుమార్తె ఆరోపించింది. శనివారం రాత్రి జరిగిన ప్రమాదానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాన్వాయే కారణమని బాధితురాలు తెలిపింది.ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి వ్యవహారం అమానవీయంగా ఉందని బాధితురాలు పేర్కొన్నారు. స్మృతి ఇరానీ కాన్వాయ్‌లోని కారు తమ కారును ఢీకొట్టిందనీ, ప్రమాదం జరిగిన వెంటనే స్మృతిఇరానీ బయటకు వచ్చారనీ తెలిపారు. సహాయం చేయాల్సిందిగా చేతులు జోడించి వేడుకున్నా మంత్రి కనికరంచూపకుండా వెళ్లిపోయారని బాధితురాలు మీడియాతో చెప్పారు. తన తండ్రిని కాపాడాలంటూ మంత్రిని వేడుకున్నప్పటికీ మంత్రి ఏ మాత్రం స్పందింలేదరన్నారు. మంత్రి స్పందించుంటే తన తండ్రి బ్రతికేవాడేనని మృతుడి కుమారుడు పేర్కొన్నారు.
కాగా, ప్రమాదానికి గురైన వారిని వెంటనే వైద్యం అందించాలంటూ స్థానిక అధికారులకు మంత్రి స్మృతిఇరానీ ఆదేశించినట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే ప్రమాదానికి మంత్రి కాన్వాయ్ కారణంకాదని మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.

Comments

comments