Home జాతీయ వార్తలు నామినేషన్ వేసిన కేంద్రమంత్రులు

నామినేషన్ వేసిన కేంద్రమంత్రులు

Union Ministersఢిల్లీ : కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్ రాథోడ్ మంగళవారం తమ నామినేష‌న్లను దాఖ‌లు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ల‌క్నో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉద‌యం లక్నోలో బిజెపి కార్యకర్తలు నిర్వహించిన రోడ్ షోలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన  నామినేష‌న్ వేశారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్‌  రాజ‌స్థాన్‌లోని జైపూర్ నియోజక‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యవర్థన్ వెంట ఆయన భార్య గాయ‌త్రీ రాథోడ్‌, యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు.

Union Ministers Files Nomination