Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అభివృద్ధిని సాధించేందుకు ప్రజలు ఏకం కావాలి

40 సంవత్సరాల కాలంలో పెద్దగా అభివృద్ధి చెందని గ్రామాలు
రాజ్యసభ సభ్యులు టి.దేవేందర్‌గౌడ్

DEV

మనతెలంగాణ/కందుకూరు: 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో కందుకూరు మండలంలోని చివరి గ్రామాలు పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదని ఇప్పటికైనా గ్రామాల ప్రజలు ఏకమై అభివృద్ధి సాధించుకోవాలని రాజ్యసభసభ్యులు తూళ్ళ దేవేందర్‌గౌడ్ సూచించారు. శనివారం కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ, దెబ్బడ గూడ, మీర్‌ఖాన్‌పేట, ఆకులమైలారం, గుమ్మడవెళ్ళి, కొలన్‌గూడ గ్రామాల్లో ఎంఎల్‌ఏ తీగలతో కలసి పర్య టించి పలు అభివృద్ధిపనులను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మీర్‌ఖాన్‌పేట్, కొన్‌గూడ గ్రామాల్లో ఏర్పాటుచేసిన సభల్లో ఆయన మాట్లాడు తూ, తాను జడ్పీ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ హోంమం త్రిగా పలు పదవులు నిర్వహించి ఇక్కడి ప్రజల జీవన విధానాలను గమనించానని, అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. గ్రామాల్లోని ఇండ్ల రూపురేఖలు మారాయని ప్రజలు మాత్రం మారలేక పోతున్నారన్నారు.

తన నిధుల నుండి నిర్మించుకున్న కమ్యూనిటీహాల్‌లను సద్వినియోగం చేసుకోవాలని పేకాటకు నిలయాలుగా మార్చకూడదని యువకులకు ఆయన హితవు పలికారు. గ్రామాల అభివృద్ది తన వంతు ప్రయ త్నం చేస్తానని రాజకీయాలకతీతంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా ఎంఎల్‌ఏ తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్దికి తన నిధులను అనుసందానం చేసి మండలానికి రూ.4కోట్ల 50లక్షల నిధులను విడుదల చేయడం జరిగిందని పేర్కోన్నారు. కందుకూరు ప్రాంతానికి పవర్‌గ్రిడ్, మిషన్‌భగిరథ, పార్మా సిటీలు ఏర్పాటు కానుండడం ఈప్రాంత ప్రజల అధృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం మిషన్‌భగిరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించేందుకు ఏర్పాట్లు చకచాక జరుగుతున్నాయని అన్నా రు. అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎంపిపి అశోక్‌గౌడ్, వైస్ ఎంపిపి సంధ్యదామోదర్‌గౌడ్, పిఎసిఎస్ ఛైర్మెన్ మల్లేష్, మార్కెట్ కమిటి వైస్ ఛైర్మెన్ శ్రీనివాస్, తహాశీల్‌దారు కృష్ణకుమార్ పాల్గొన్నారు.

రూ.43లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం
కందుకూరు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులను ఎంపి దేవేం దర్‌గౌడ్ ఎంఎల్‌ఏ తీగలతో కలసి ప్రారంభించారు. ఎంపి నిధులతో నిర్మించిన అభివృద్ది పనులు కొత్తగూడలో 6లక్షలతో నిర్మించిన భూగర్బడ్రైనేజీతో పాటు సిసి రోడ్డును, దెబ్బడగూడలో 5లక్షలతో వేసిన సిసిరోడ్డు,5లక్షలతో నిర్మంచిన నీటి శుద్ది కేంద్రంను, ఆకులమైలారంలో 7లక్షలతో చేపట్టిన సిసిరోడ్డుతో పాటు భూగర్బ డ్రైనేజీలను గుమ్మడవెళ్ళిలో 5లక్షలతో నిర్మించిన సిసిరోడ్డు, భూగర్బ డ్రైనేజీని, కొలన్‌గూడలో 5లక్షలతో నిర్మించిన బిసి కమ్యూనిటి హాలును, మీర్‌కాన్‌పేటలో 5లక్షలతో నిర్మించిన నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు.

Comments

comments