Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

త్రివిక్రమ్ యూనివర్సల్ డైరెక్టర్

a-aaత్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా హాసినీ అండ్ హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘అ..ఆ’. ఈ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫు ల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృం దం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వ హించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మా ట్లాడుతూ “ఈ సిని మా చేయాలనుకున్నప్పుడు నా కిష్టమైన రచయిత యద్ధనపూడి సులోచనా దేవిని కలిసి మాట్లాడాను. కొన్ని క్యారెక్టర్స్ గురించి కూడి చర్చించుకున్నాం. ఇక సమంత ఒ క రోజు మీరు బ్రెయిన్‌తో కాకుండా మాతో మాట్లాడిన విధంగా హార్ట్‌తో ఎందుకు డైలాగ్స్ రాయరని ప్రశ్నించింది. అలా రాయడానికి ఈ సినిమాలో ప్రయత్నిం చాను. నితిన్, సమంత ఈ సినిమా కోసం వారి పూర్తి సమయాన్ని కేటా యించారు. సీనియర్ నరేష్, రావు రమేష్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ సిని మా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో హార్డ్‌వర్క్ చేశా రు. అందుకే ఇంత పెద్ద విజయం సాధించిం ది”అని చెప్పారు. నితిన్ మాట్లాడుతూ “ఈ సిని మా సక్సెస్ క్రెడిట్ పూర్తిగా త్రివిక్రమ్‌కే దక్కుతుంది. ఆయన క్లాస్, మా స్ డైరెక్టర్ కాదు… యూనివర్సల్ డైరెక్టర్. ఆయన రై టింగ్, దర్శకత్వ ప్రతిభలే అందుకు కారణం. మా నిర్మాత రాధాకృష్ణ నామీద నమ్మక ంతో ఎక్కువ బడ్జెట్ పెట్టారు. నాకు మంచి హిట్ ఇవ్వడమేకాకుండా నా రేంజ్ కూడా పెంచారు. ఆయనకు నా కృతజ్ఞతలు”అని చెప్పారు. సమంత మాట్లాడుతూ “నాకు కొన్ని సినిమాలు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ తెస్తే… మరికొన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ తెస్తాయి. కానీ ఈ సినిమా ఈ రెండూ తెచ్చిపెట్టాయి. ఇది పర్సన ల్ విక్టరీగా భావిస్తున్నాను. అనుకున్న ప్రకారం ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టారు త్రివిక్ర మ్‌”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నరేష్, అజయ్, ప్రవీణ్, హరితేజ, కృష్ణచైతన్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments