Home జనగామ రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Unknown man dead after fall from Train in Station Ghanpur

వరంగల్: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. సిర్పూర్‌కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 45 ఏళ్ల వ్యక్తి రైలు స్టేషన్‌ఘన్‌పూర్ మీదుగా వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. అది గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108 ద్వారా హాస్పిటల్‌కు తరలించారు. కాగా, బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.