Home తాజా వార్తలు హిమాయత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్య

హిమాయత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్య

Boy Murder in Srikakulam

హైదరాబాద్: నగరంలోని హిమాయత్‌గర్‌లో ఆదివారం దారుణం జరిగింది. హిమాయత్‌నగర్ వీధినం.01లో దుండగులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు. మునిస్వామి అనే వ్యక్తిని తలపై బండరాయితో కొట్టి చంపేశారు. వాచ్‌మన్‌గా పనిచేస్తున్న పాతభవనంలోనే దుండగులు మునిస్వామిని హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని విజయనగరం జిల్లా వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.