Home రంగారెడ్డి నగర శివారులో దారుణ హత్య..

నగర శివారులో దారుణ హత్య..

Unknown People Murdered  Man In Rangareddy District

శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండల పరిధిలోని ఘంసీమియాగూడ గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. శంషాబాద్ రూరల్ సిఐ క్రిష్ణాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఘంసీమియా గ్రామ శివారులో  వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి తలపై బలమైన గాయాలు ఉండటంతో బండరాలతో లేదా ఇనుప రాడులతో మోది చంపినట్లు గుర్తించారు. మృతుడు దగ్గర దొరికిన ఆధార్ ఆధారంగా హత్య కాబడ్డ వ్యక్తి గుజరాత్ రాష్ట్రానికి  చెందిన దిలప్‌పటేల్ (60)గా గుర్తించారు. అయితే దిలీప్ సమీప బంధువు రాజుబాయ్ పటేల్ కు ఘంసీమియగూడ లో ఉన్న వ్యవసాయ పొలంలో పనిచేసే వాడు. అయితే దీలీప్ తాగుడుకు బానిస కావడంతో పనిలో నుంచి తొలగించారు. ఈ మధ్యనే మహేశ్వరం సమీపంలోని నాగారం గ్రామంలో ఓ హోటల్‌లో కార్మికుడిగా చేరారు. శనివారం ఉదయం ఘంసీమియాగూడ గ్రామంలో శవమై కనిపించాడు. దిలీప్ హాత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.