Home తాజా వార్తలు గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పద మృతి

గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పద మృతి

sucide-unknown-person

మహబూబ్‌నగర్‌ః వనపర్తి పట్టణ పరిధిలోని పీర్లగుట్టపై 45 సంవత్సరాల వయస్సు గల ఓ వ్యక్తి శవం లభించినట్లు ఎస్సై గాంధినాయక్ తెలిపారు. పీర్లగుట్ట పై భాగంలో ఓ వ్యక్తి శవం వుండటాన్ని గమనించిన స్థానికులు ఎస్సైకి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకోని పరిశీలించగా వారం రోజుల క్రితం చెట్టుకు ఉరివేసుకోని మృతిచెందినట్లు మోకాళ్ళ ఎత్తులో భూమిపై వేలాడుతూ వుండటాన్ని గమనించి శవానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పదంగా కేసునమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గాంధినాయక్ తెలిపారు.