Search
Thursday 15 November 2018
  • :
  • :

కాచిగూడలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Unknown Person Dies In KachiGuda Railway Station

కాచిగూడ: పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ డి.విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి డబీపుర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో  ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి  చెందాడు. సమాచారం తెలుసుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  మృతి  చెందిన వ్యక్తి ఒంటిపై బూడిద రంగు చొక్క, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Comments

comments