Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఈ పెళ్లిలో కెసిఆర్‌ను చంపేస్తాం …

KCR1హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ చంపేస్తామన్న ఫోన్ కాల్ అందరిని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజక వర్గం ఎంఎల్‌ఎ విద్యాసాగర్ రావుకు నిన్న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అతి త్వరలో సిఎం కెసిఆర్ చంపుతామని ఫోన్‌లో బెదిరించాడు. దీంతో అయోమయంలో పడిని ఎంఎల్‌ఎ విద్యాసాగర్ ప్రక్కన ఉన్న ఎస్‌ఐకు ఫోన్ ఇచ్చాడు. ఎస్‌ఐతో కూడా ఇదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడాడు. పెద్దపలి ఎంపి బాల్కసుమన్ చెల్లి పెళ్లికి కెసిఆర్ హాజరవుతున్నారు. కావునా ఈ పెళ్లి వేడుకలో కెసిఆర్ చంపుతామని బెదిరించారు. కెసిఆర్‌ను పదే పదే చంపుతామని చెప్పడంతో ఈ విషయాన్ని జగిత్యాల డిఎస్‌పి దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయం పై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Comments

comments